Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: 100 రోజుల ప్రణాళిక అమలుపై డిప్యూటీ సీఎం కీలక సమీక్ష..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: 100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చించారు.. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో సమాలోచనలు చేశారు.. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Hyderabad: మల్లాపూర్లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్!

తన క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖ శాస్త్రవేత్తలతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు పవన్ కల్యాణ్‌.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు.. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.. వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ గారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

కాగా, గత వారం కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించిన విషయం విదితమే.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మత్స్యకారులతో బహిరంగ సభలో పాల్గొన్నారు.. సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను మరో మూడు రోజుల్లో బోటులో వెళ్లి పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే.. కాగా.. ఇప్పుడు 100 రోజుల ప్రణాళిక అమలుపై ఇప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version