Deputy CM Pawan Kalyan: సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసిందన్నారు.. గత ఐదేళ్లల్లో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు. గతంలో ఏపీలో పని చేసేందుకు ఐఏఎస్‌లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో ఏపీలో పని చేయడానికి ఐఏఎస్‌లు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఓ రాష్ట్రం ఎలా ఉండాలో గతంలో ఏపీ వైపు చూసేవారు.. కానీ గత ఐదేళ్ల కాలంలో ఓ రాష్ట్రం ఎలా ఉండకూడదో చూపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారు. ఎన్నో అవమానాలను.. ఆంక్షలను ఎదుర్కొని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డాం అన్నారు పవన్ కల్యాణ్.
Read Also: Stock Market Crash : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. అయోమయంలో ఇన్వెస్టర్లు
ఇక, ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలన్నారు డిప్యూటీ సీఎం పవన్… ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పాలనానుభవం, పాలనా దక్షత నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నాం. పాలనా వ్యవస్థను గత ప్రభుత్వం చిధ్రం చేసింది. అనుభవంతో పని చేసేందుకు చంద్రబాబు, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాం అన్నారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించేందుకే మేం ఇక్కడ ఉన్నాం. మా వైపు నుంచి ఏమైనా తప్పులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రజలకు సేవ చేసే విషయంలో మా వల్ల మీరు ఓ అడుగు ముందుకు వేసేలా ఉంటుందే తప్ప.. అడుగులను ఆపే పరిస్థితి ఉండకూడదన్నారు. విభజన తర్వాత నుంచి చాలా కష్టాలు పడ్డాం. గత ఐదేళ్ల కాలంలో ఏపీ బోర్డర్ దాటి రావాలన్నా.. ఇబ్బందులు పడ్డాం. స్కిల్ సెన్సస్ చాలా కీలకమైందని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..