Cyclone Montha: తీరం వైపు మొంతా తుఫాన్ దూసుకొస్తుంది.. మరింత బలపడి.. ముందుకు సాగుతోంది.. గంటకు 17 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది.. దీంతో, ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలో మీటర్లు, కాకినాడకు 310 కిలో మీటర్లు, విశాఖపట్నానికి 370 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. ఈ ఉదయం తీవ్రమైన తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఈ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.. ఈ సమయంలో గంటకు 90 – 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఓ దశలో 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు..
Read Also: Daily Horoscope: మంగళవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగంలో జాక్‌పాట్ పక్కా!
ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది మొంతా తుఫాన్.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.. మరోవైపు, అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడింది.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో డిప్రెషన్ కొనసాగుతుంది.. గత 12 గంటల్లో స్థిరంగా కొనసాగిన వాయుగుండం.. ప్రస్తుతం ముంబైకి 650 కిమీ, గోవాకు 710 కిమీ, మంగళూరుకు 920 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది.. 48 గంటల్లో ఉత్తర – ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది.. గుజరాత్, మహారాష్ట్ర తీరాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ..
