Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి, గుంటూరు కలెక్టర్.. నాగలక్ష్మి, జీఏడీ అధికారులు హాజరు కాగా.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పెషల్ సీఎస్ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Damodar Raja Narasimha: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
గత ప్రభుత్వ హయంలో జిల్లాల్లో భూములు, మైన్స్, ఇసుక, సహజ వనరుల దోపిడీ జరిగిందని గుర్తించినట్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడు సర్కార్ చెబుతోన్న విషయం విదితమే.. అయితే, ఆయా అంశాలపై పై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు ఫోకస్ పెడతారని తెలుస్తోంది.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు.. కలెక్టర్లు, ఎస్పీలతో జిల్లాల్లో శాంతి భద్రతలు, గంజాయి సాగు, అమ్మకాలపై కట్టడి వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్న చంద్రబాబు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటనలో నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ.. వివిధ రంగాలపై శ్వేతపత్రాలను సైతం విడుదల చేశారు.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు..