NTV Telugu Site icon

YCP: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస భేటీలు.. నేతల్లో టెన్షన్..

Cm Jagan

Cm Jagan

YCP MLAs: ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యేతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం అవుతున్నారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలంపై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆయా స్థానాలకు కొత్త ఇంఛార్జులను నియమించేందుకే వారితో భేటీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.

Read Also: IPL Auction 2024: నేడే ఐపీఎల్‌ మినీ వేలం.. అదృష్టం పరీక్షించుకోనున్న 333 మంది ఆటగాళ్లు! జాక్‌పాట్‌ ఎవరికో

అలాగే, విజయవాడ పైనా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. మరోవైపు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతుంది. తమ నియోజకవర్గాల్లో వేరే వాళ్లను ఎన్నికల బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం సాగుతుండటంతో వాళ్లు టెన్షన్ పడుతున్నారు. తమకు ఎక్కడ ఎమ్మెల్యే సీటు రాకుండా పోతోందనని భయపడుతున్నారు. సీఎం జగన్‌ను కలిసి సీటుపై గ్యారంటీ తీసుకోవాలనే కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను సైతం ఆయన మార్చారు. మరికొంత మంది ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Read Also: Rice Price Hike: భారీగా పెరిగిన బియ్యం ధరలు.. రంగంలోకి దిగిన ప్రభుత్వం

ఈ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమనే అంశాలపై ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. ఇంఛార్జులను నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దు.. పార్టీలో అందరికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని జగన్ చెప్పుకొస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలి.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సీఎం జగన్ సూచించారు.