Site icon NTV Telugu

CM Chandrababu: మైనింగ్‌ శాఖపై సీఎం సమీక్ష.. వడ్డెరలకు గుడ్‌న్యూస్‌..

Cbn

Cbn

CM Chandrababu: మైనింగ్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వడ్డెరలకు శుభవార్త చెప్పారు.. వడ్డెరలకు మైనింగ్ లీజ్‌కు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు… వడ్డేర్ల సొసైటీలకు 15 శాతం గనులు లీజ్‌కు ఇచ్చే అంశంలో దృష్టి పెట్టాలన్నారు చంద్రబాబు.. వడ్డేర్లకు ఆర్ధిక ప్రయోజనం కల్పించేలా లీజ్ కేటాయింపు విధానం ఉండాలన్నారు… రాష్ట్రంలో ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు సీఎం చంద్రబాబు… మైనింగ్ పై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారుల తో సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మైనింగ్‌ జరుగుతోన్న తీరును వివరించారు అధికారులు.. ఇక, గనుల శాఖపై, ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ.. ఈ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Jio Diwali Offer 2025: దీపావళికి జియో గోల్డెన్ ఆఫర్.. రూ.10 లక్షల వరకు గెలుచుకునే ఛాన్స్

కాగా, గత సమీక్షా సమావేశంలో గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్షించిన విషయం విదితమే. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం వృద్ధి సాధించగా.. 2019-24 మధ్య 7 శాతానికి పడిపోయిందని అధికారులు సీఎంకు వివరించారు. గ‌త‌ ప్రభుత్వంలో రూ.9,750 కోట్ల ఆదాయం నష్టపోయిందని పేర్కొన్నారు.. ఆ 5 ఏళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపైనా సీఎం చద్రబాబు నాయుడు సమీక్షించిన విషయం విదితమే..

Exit mobile version