CM Chandrababu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ముఖ్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష చేయనున్నారు.. ఫైళ్ల క్లియరెన్సు, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇతర పాలనాపరమైన అంశాలపై సమీక్షించనున్నారు.. పాలనలో వేగం పెంచే అంశంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.. ఇదే క్రమంలో సంక్షేమ పథకాల అమలు తీరు, సూపర్ సిక్స్ లోని ఇతర హామీలపైనా మంత్రులు, కార్యదర్శులతో చర్చించనున్నారు..
Read Also: Mrunal: గ్యాప్ రాలేదు.. ఇచ్చిందట!
ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు హాజరుకానున్నారు.. వీరితో పాటు అన్ని శాఖల కార్యదర్శుల కూడా హాజరుకానుండటంతో సచివాయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. ఈ సమావేశానికి వచ్చే వారికి ఎటువంటి లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మీనా సూచించారు.. ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు, వారి కార్యదర్శులు అందుబాటులో ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో వివరించనున్నారు.. దీనికి అనుగుణంగా టీవీలు, మైకులు ఏర్పాటు చేశారు. సమావేశం జరిగినంత సేపు విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. సమావేశానికి హజరయ్యే వారికి స్వాగతం పలికేలా ఫ్లెక్సీలతో పాటు సమావేశం వివరాలను తెలిపే బ్యాక్ డ్రాప్ట్ బోర్డులను కూడా సిద్ధం చేశారు. సమావేశం జరిగే మందిరాన్ని తీర్చిదిద్దండంతో పాటు భోజనాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను సాదారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ అధికారులతో పాటు ఐ అండ్ పీఆర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇవాళ్టి సమావేశం రెండు సెషన్‌లుగా జరగనుంది.. మొదటి సెషన్‌లో ఫైళ్ల క్లియరెన్స్.. జీఎస్‌డీపీ సెకండ్ సెషన్‌లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీంతో పాటు ఏపీ బడ్జెట్‌పై అధికారులతో చర్చించనున్నారు.