Site icon NTV Telugu

Andhra Pradesh: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. డబుల్ ధమాకా..! నేడు ఖాతాల్లో సొమ్ము జమ..

Annadata Sukhibhava

Annadata Sukhibhava

Andhra Pradesh: రైతన్నలకు ఏపీ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. నేడు అన్నదాత సుఖీభ‌వ‌ – పీఎం కిసాన్ రెండో విడత నిధులు జ‌మ కానున్నాయి. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాలో రెండో విడతలో ఏడు వేల లెక్కన జమ చేయనుంది ప్రభుత్వం. ఇవాళ కడప జిల్లా కమలాపురం, పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు NPCAలో ఉపయోగించని ఖాతాలను తిరిగి వినియోగంలోకి తేవాలని క్షేత్ర స్ధాయిలో వ్యవసాయ అధికారులు స‌మ‌న్వయం చేసుకుని ప‌ర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Read Also: Indiramma Saree: నేటి నుంచే ఇందిరమ్మ “కోటి” చీరల పంపిణీ.. చివరి తేదీ ఇదే..

మరోవైపు న్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయబోతోంది ప్రభుత్వం. రెండో విడతలో మొత్తం 46 లక్షల 62 వేల 904 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా ఈ పథకం మీద సందేహాలు నివృత్తి చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం వాటా 2 వేలు, రాష్ట్ర వాటా 5 వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఒక్కొక్క రైతుకు చెల్లిస్తారు..

ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ – కిసాన్ కార్యక్రమానికి హాజరవుతారు.

సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి షెడ్యూల్..
* మధ్యాహ్నం 1 గంటలకు హెలికాప్టర్ ద్వారా పెండ్లిమర్రి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
* మధ్యాహ్నం 1:20–1:30 గంటలకు వెల్లూరులోని ‘మన గ్రోమోర్’ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించనున్న సీఎం.
* మధ్యాహ్నం 1:40 గంటలకు పెండ్లిమర్రిలో నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
* సాయంత్రం 4:20 గంటలకు చిన్నదొరపల్లెలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం.
* సాయంత్రం 6 గంటలకు కడప విమానాశ్రయం నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం.

Exit mobile version