Site icon NTV Telugu

CM Chandrababu: మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్‌, వైసీపీ మధ్య తీవ్రమైన యుద్ధానికే తెరలేపింది.. పీపీపీ మోడ్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు కోటికి పైగా సంతకాలను గవర్నర్‌కు అందజేసిన విషయం విదితమే కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Shivaji Press Meet: నేను ఎవ‌రితోనూ మిస్ బిహేవ్ చేయ‌లేదు.. నా భార్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాను..

అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బిడ్డర్స్‌ (టెండర్‌లో పాల్గొనే సంస్థలు)తో నేరుగా సంప్రదింపులు జరపాలన్న సూచన కూడా చేశారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాలేజీ నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పీపీపీ (Public–Private Partnership) విధానం విజయవంతంగా అమలులో ఉందని గుర్తుచేసిన చంద్రబాబు.. ఏపీలో కూడా మెడికల్ కాలేజీలను అదే విధానంలో నిర్మించి, ప్రజలకు భారంలేకుండా మెరుగైన వైద్య విద్య అందిస్తామని తెలిపారు.

మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం. ఇందులో రాజీ లేదు. ఆలస్యం లేకుండా ముందుకు వెళ్లాలి అని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.. సీఎం వ్యాఖ్యలతో టెండర్ల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. వైద్య రంగ విస్తరణలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుండటంతో.. రాష్ట్రంలో వైద్య విద్యకు కొత్త ఊపు రానుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version