Site icon NTV Telugu

CM Chandrababu: జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై ఫోకస్‌ పెట్టండి.. సీఎం ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు, ఆర్టీజీఎస్ సమీక్ష నిర్వహించారు సీఎం.. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలు అందించిన సేవలు ప్రజా సంతృప్త స్థాయిపై సమీక్షించారు.. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరయ్యారు.. జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ది తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు.. దీపావళి పండుగ తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని మరింతగా తీసుకెళ్లాలని ఆదేశించారు..

Read Also: Andhra Pradesh: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. అమల్లోకి కొత్త నిబంధనలు..

ఇక, దీపావళి తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక టాస్క్ ఇస్తున్నారు.. జీఎస్టీ అంశాన్ని జనంలోకి తీసుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. ముఖ్యంగా జీఎస్టీ క్యాంపెయినింగ్‌పై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గింపు అంశాన్ని గిరిజన ప్రాంతాల్లోకి ప్రత్యేకంగా తీసుకువెళ్లాలన్నారు సీఎం చంద్రబాబు.. కాగా, జీఎస్టీ శ్లాబ్‌లను కేంద్ర ప్రభుత్వం కుదించిన విషయం విదితమే.. దీని ద్వారా సామాన్యులకు లబ్ధి చేకూరుతుందిని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.. మరోవైపు, జీఎస్టీ తగ్గినా.. అది వినియోగదారులకు బదిలీ కావడం లేదనే ఫిర్యాదులు కూడా లేకపోలేదు..

Exit mobile version