Site icon NTV Telugu

Potti Sriramulu Statue: పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’గా నామకరణం.. నమూనాలను పరిశీలించిన సీఎం..

Potti Sriramulu Statue

Potti Sriramulu Statue

Potti Sriramulu Statue: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. ఇక, రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: Mahesh Kumar Goud: ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసే ఉండాలి.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయం మాదే..

Exit mobile version