CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించిన ప్రభుత్వం.. 12 జిల్లాల్లో పాతవారినే కొనసాగించిన ప్రభుత్వం.. ఎస్పీల పనితీరు, శాంతిభద్రతల కోణంలో బదిలీలు చేశారు.. ఇక, ఎస్పీల బదిలీలపై ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్.. మరోవైపు.. జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారు.. శాంతి భద్రతలకు ప్రాధాన్యం… పెట్టుబడులకు అదే కీలకం అని స్పష్టం చేశారు.. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి అని ఆదేశించారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సింగయ్య మృతి కేసు స్టడీలుగా చూడండి అని సూచించారు.. ఇక, ఇన్వెస్టిగేషన్‌లో టెక్నాలజీతో బెస్ట్ రిజల్ట్ చూపించవచ్చు అన్నారు.. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించండి అని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి.. అదే సమయంలో అసాంఘిక శక్తులు భయపడేలా పని చేయండి అని స్పష్టం చేశారు.. ఇంకో వైపు, సోషల్ మీడియా పోస్టులపై ఫోకస్ పెట్టండి.. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయండి అని జిల్లా ఎస్పీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..
CM Chandrababu: ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం..
- శాంతి భద్రతలకు ప్రాధాన్యం.. పెట్టుబడులకు అదే కీలకం..
- రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి..

Cbn