Site icon NTV Telugu

CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. వరుసగా రెండో నెల కూడా 1వ తేదీనే ఒకేరోజు రికార్డు స్థాయిలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసింది.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.. ఇక, ఫించన్ల పంపిణీపై స్పందించిన సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం. వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు..

Read Also: Telangana Assembly 2024: సీతక్క వీడియో మార్ఫింగ్.. ట్రోలింగ్ అంశం పై సభలో చర్చ..

ఇక, ప్రభుత్వ ఉద్యోగులు అంటే.. ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశాం అన్నారు సీఎం చంద్రబాబు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అనేక సమస్యలు ఉన్నా.. రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించాం. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం అన్నారు.. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలిసి కష్టపడదాం… రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

https://x.com/ncbn/status/1819223620473803001

Exit mobile version