Site icon NTV Telugu

CM Chandrababu: సింగపూర్ పర్యటనపై కేబినెట్‌లో చర్చ.. గత ప్రభుత్వ పెద్దలు అక్కడకు వెళ్లి బెదిరించారు..!

Cbn

Cbn

CM Chandrababu: ఏపీ కేబినెట్‌ సమావేశంలో తన సింగపూర్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రులకు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్ పర్యటన వివరాలు గురించి కేబినెట్‌ సమావేశంలో సహచర మంత్రులకు చెప్పారు.. వైఎస్‌ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రానని చెప్పారు.. సీడ్ క్యాపిటల్ లో భాగస్వామ్యం కాబోం అన్నారు.. అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులను ఆనాడు జగన్ ప్రభుత్వ పెద్దలు బెదిరించారు.. కేసులు పెడతాం అని భయపెట్టారు.. వాళ్లను బెదిరించే పరిస్థితి అప్పుడు జరిగింది.. కానీ, పార్టనర్‌షిప్‌ సమ్మిట్ కు వాళ్లను రావాలని చెప్పాం.. సింగపూర్ తో స్నేహ సంబంధాలు కొనసాగించాలని చెప్పామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read Also: RBI Governor: ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..

ఇక, ఆగస్టు 15 న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాలో.. మంత్రులు అందరూ పాల్గొనాలని చెప్పారు సీఎం చంద్రబాబు.. ఆ రోజు స్వాతంత్ర్య దినం కావడంతో మంత్రులు అందరు బిజీ గా ఉంటారు అని చెప్పారు మంత్రులు.. కానీ, టైమ్ అడ్జస్ట్ చేసుకుని అందరు ఫ్రీ బస్సు కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు సీఎం.. ఇక, బార్ పాలసీని కేబినెట్‌ ఆమోదించింది.. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాప్‌లలో బినామీలు వస్తే సహించను అని స్పష్టం చేశారు సీఎం.. ఆర్టీసీ బస్సులలో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక మునుపే.. ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించగా.. మంత్రి మనోహర్ చేసిన సూచన మంచిది అని చెప్పారు సీఎం.. వెంటనే ఆటో డ్రైవర్లను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సూచించారు సీఎం నా చంద్రబాబు నాయుడు..

Exit mobile version