NTV Telugu Site icon

CM Chandrababu: ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన..

Babu

Babu

CM Chandrababu: సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు.. క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ల వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయం వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇక, ప్రతి మూడు నెలలకొసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలన్నారు.. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే విధంగా గత పాలకులు వ్యవహరించారు. ఐఏఎస్ అధికారుల మనో ధైర్యాన్ని గత ప్రభుత్వం దెబ్బ తీసే విధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంధ్ర ఆఫీసర్లు అంటే గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవుల్లోకి వెళ్లారు. ఏపీలో పని చేసిన వాళ్లు ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. కానీ, గత పాలన వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బతిందన్నారు.. ఏపీ ఆఫీసర్లు అంటే అంటరాని వాళ్లను చూసినట్టు చూస్తున్నారు. ఏపీ అధికారులంటే ఏం చేయలేరు.. చేతకాని వాళ్లు అన్నట్టు ఢిల్లీలో అభిప్రాయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ సంచలన వ్యాఖ్యలు..

ఏపీని పునర్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చాం.. రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రజా వేదిక ఉంటే అక్కడే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టేవాళ్లం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ బయట పెట్టడం ఇష్టం లేక.. ప్రజా వేదిక కట్టాం. కానీ, దాన్ని కూల్చేశారని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు.. క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ల వల్ల కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తారన్న సీఎం.. ఐఏఎస్‌లుగా ఉన్న వాళ్లకి కలెక్టర్లుగా చేయడం ఓ కల. పని చేయకుంటే గ్యారెంటీ లేదు. ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చాలా చక్కటి అవకాశం. బెస్ట్ కలెక్టర్ అనిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల పాలనలో ఏపీకి జరిగింది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం ఫిర్యాదులు భూ సమస్యలే ఉన్నాయి. రీ-సర్వేను హోల్డులో పెట్టాం. సర్వే రాళ్లను గెలాక్సీ గ్రానైట్ రాళ్లతో వేశారు. తన ఫొటో వేసుకోవడం కోసం గెలాక్సీ గ్రానైట్ రాళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Tollywood: ఫస్ట్ వీకెండ్ ముగిసింది.. రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ రివ్యూ..?

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంభించాలన్నారు సీఎం చంద్రబాబు.. ఐదేళ్లల్లో రూ. 1.64 లక్షల కోట్ల మేర పెన్షన్లు ఇవ్వబోతున్నాం. పేదల సేవలో అనే కార్యక్రమం కింద కలెక్టర్లు, అధికారులు పేదలతో మమేకం కావాలి. జీరో పావర్టీ అనేది ప్రభుత్వ లక్ష్యం. పీ-4 విధానం అమలు చేయాలి. రూల్ బౌండెడ్ కాకుండా మానవతా ధృక్ఫధంతో ఆలోచించాలి. సహచరులతో సౌమ్యంగా ఉండండి.. పెత్తందారీ పోకడలతో పోవద్దు. కలెక్టర్ల పనితీరు.. ప్రభుత్వం మీద పడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రజా ప్రతినిధులను గౌరవించాలి. ఎమ్మెల్యేలు ఏమైనా చెబితే వినండి.. సమస్యలను పరిష్కరించండి. ఇది పొలిటికల్ గవర్నెన్స్. మాకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. కొత్తగా కొందరు ఎమ్మెల్యేలు కూడా సైరన్ వేస్తున్నారు. నియంతలు మళ్లీ అధికారంలోకి రాలేదు. మేం తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకీ రాలేం. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు అసెంబ్లీకి కూడా రాలేకపోయారు. పరదాలు కట్టడం.. రోడ్లు బ్లాక్ చేయడం వంటివి చేయొద్దు. టెక్నాలజీని వినియోగించుకోవాలి.. అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని అనుసంధానం చేస్తూ యాప్ క్రియేట్ చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు..

Show comments