Site icon NTV Telugu

CM Chandrababu: మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికాంర దూరమై.. తిరుగులేని మెజార్టీ స్థానాలు సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి సర్కార్‌.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం తర్వాత ఏడాది పాలన పై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. సంక్షేమ పథకాల విషయంలో జనానికి స్పష్టంగా చెప్పాలని సూచించారు.. తల్లికి వందనం అమలుపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది..

Read Also: Huawei Pura 80 Series: మాస్టర్ ప్లాన్ వేసిన హువావే.. ఒకేసారి నాలుగు మొబైల్స్ లాంచ్..!?

మంత్రులతో పలు విషయాలు చర్చించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న ఆయన.. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్థులను కలవాలంటే భయపడేవారు.. ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.. నేరస్థులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదన్నారు.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా బాగుంది.. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలి – ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని.. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు..

Exit mobile version