Minister Narayana: మున్సిపల్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.. అయితే టౌన్ ప్లానింగ్ లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు ఈ రోజు సీఎంకు అందజేశారు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు సీఎం చంద్రబాబుకు అందించామని తెలిపారు.. 7 టీమ్‌లు పది రాష్ట్రాల్లో తిరిగి అక్కడి లే ఔట్, బిల్డింగ్ అనుమతులు స్టడీ చేశారు.. 15 మీటర్లు లేదా ఐదంతస్తులు ఇల్లు కట్టే వారికి అనుమతుల్లో మార్పులు చేశాం.. లైసెన్స్‌డ్ సర్వేయర్లు.. వాళ్ల ప్లాన్ ను ఆన్ లైన్ లో పంపించి ఫీజు కడితే అనుమతిచ్చినట్టే భావించబడుతుంది.. ఒకవేళ ప్లాన్ డీవియేషన్లు వస్తే ఆ సర్వేయర్ లైసెన్స్ రద్దవుతుందని హెచ్చరించారు.
Read Also: Maharashtra: సీఎం పదవిపై వెనక్కి తగ్గిన షిండే వర్గం.. కారణమిదేనా?
ఒక ప్లాన్ కు దరఖాస్తు చేయడానికి అన్ని రకాల డిపార్ట్మెంట్‌లకు అనుమతులకు సింగిల్ విండో విధానం అమల్లోకి రాబోతోందన్నారు మంత్రి నారాయణ.. అన్ని శాఖల సర్వర్లను మున్సిపల్ శాఖ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అన్నారు.. ఈ సింగిల్ విండో అనుమతుల విధానం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఇకపై TDR తీసుకోకుండా మున్సిపల్ పర్మిషన్ తో బిల్డింగ్ కట్టుకోవచ్చు అన్నారు.. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్ధలం ఉన్న చోట రెసిడెన్షియల్ లో సెల్లార్‌కు అనుమతి… 120 మీటర్ల ఎత్తు 18 మీటర్ల సెట్ బ్యాక్.. 120 మీటర్లు ఆ పైన దాటితే 20 మీటర్లు సెట్ బ్యాక్.. పార్కింగ్ కు 5 ఫ్లోర్లు వరకూ పోడియం కట్టుకునే అవకాశం.. పది ఫ్లోర్లు ఉండే బిల్డింగ్ లకు ఒక ఫ్లోర్ రిక్విజిషన్ కు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.. లే ఔట్ లు వేసేవాళ్లు 9 మీటర్లు రోడ్డు వదిలితే చాలు అని స్పష్టం చేశారు.. ఇక, మరో 15 రోజుల్లో తణుకు, తిరుపతి TDRలపై సీఎం చంద్రబాబుకు రిపోర్టు ఇస్తామని తెలిపారు.. 21.73 లక్షల మంది మెప్మా వారి గురించి సీఎం చర్చించారని వివరించారు.. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అగ్రిమెంట్ రెన్యువల్ అయింది.. దానిని ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు.. రూ.6,500 కోట్లు పైన అవుతుంది AIB లోన్… ఒకవేళ అదనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు మంత్రి నారాయణ.