NTV Telugu Site icon

CM Chandrababu: జీవితాంతం మర్చిపోలేను.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..

Babu 2

Babu 2

CM Chandrababu: రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు తనను చూసేందుకు వచ్చిన తెలుగువారందరికీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. అందరూ చనిపోయిన తర్వాత గుర్తుంచుకుంటారని.. తనను మాత్రం బతికుండగానే గుర్తుంచుకున్నారని.. జీవితాంతం మర్చిపోలేమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్‌లో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు… జ్యూరిక్‌ ఎయిర్‌పోర్టు నుంచి హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. హోటల్‌లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను వివరించారు సీఎం చంద్రబాబు. తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం రాష్ట్రానికి వచ్చి చాలా మంది యూరోప్‌లోని తెలుగువాళ్లు కృషి చేశారని.. వారి అభిమానాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటామన్నారు. అసలు ఇంతమంది తెలుగువాళ్లు యూరప్‌లో ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతోందన్నారు సీఎం చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో.. తాను హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టానని గుర్తు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐటీని ప్రోత్సహించామని.. అదిప్పుడు హైదరాబాద్‌కు మంచి ఆదాయం తెచ్చిపెడుతోందన్నారు. తెలుగువాళ్లు ఎంటర్ ప్రెన్యూర్స్‌గా మారాలని తాను అప్పట్లోనే సూచించానన్నారు చంద్రబాబు.ఇప్పుడు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు ఎంటర్ ప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారన్నారు. జన్మభూమి-కర్మభూమి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలన్నారు చంద్రబాబు.దేన్ని విస్మరించకూడదని తెలిపారు. 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే తొలి రెండు స్థానాల్లో ఉండొచ్చన్నారు చంద్రబాబు. దానిపై తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు. దేశం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు.

బిల్‌గేట్స్‌ ఐదు నిమిషాల సమయం తీసుకుని 45 నిమిషాల నా విజన్‌ వివరించాను.. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టాలని కోరాను.. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ పెట్టడంతో సత్య నాదెళ్ల ఆ కంపెనీకి సీఈవో అయ్యారని తెలిపారు సీఎం చంద్రబాబు.. మీరంతా గ్లోబల్‌ లీడర్స్‌ కావాలి.. తెలుగువాళ్లు ప్రపంచమంతా ఉండాలి.. కర్మభూమిని, జన్మభూమిని బ్యాలెన్స్‌ చేయాలి.. వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే నినాదం తీసుకున్నాను.. ఉక్రెయిన్‌ వార్‌ వచ్చినప్పుడు మీ సాయంతోనే మెడిసిన్‌ స్టూడెంట్స్‌ను దేశానికి రప్పించగలిగాం అన్నారు.. మొదటిసారి ఐటీ గురించి మాట్లాడాను.. హైదరాబాద్‌లో భూములు అమ్మవద్దని చెప్పాను.. హైదరాబాద్‌ వల్ల తెలంగాణకు దేశంలోనే తలసరి ఆదాయంలో మొదటి స్థానం వచ్చింది.. ఉద్యోగాలు చేయడం కాదు, ఇచ్చే స్థాయికి రావాలని చెప్పేవాడిని.. ఆ రోజుల్లో ఆడపిల్లలను చదివించేవారు కాదు.. కాలేజీ సీట్లలో 33 శాతం ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన కీకలక అంశాలను తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..