Site icon NTV Telugu

CI Legal Notice To Chandrababu: సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్‌ నోటీసులు..

Ci Legal Notice To Chandrab

Ci Legal Notice To Chandrab

CI Legal Notice To Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్‌ నోటీసులు పంపించారు సీఐ శంకరయ్య.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సందర్భంలో పులివెందుల సీఐగా విధులు నిర్వహించిన జె.శంకరయ్య.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుకు లీగల్ నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది.. వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా సీఎం చంద్రబాబు పలు మార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తున్న సీఐ శంకరయ్య.. న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18వ తేదీన నోటీసులు పంపారు. అయితే ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన ప్రతిష్టకి భంగం కలిగించేలా మాట్లాడిన చంద్రబాబు.. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాక, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు కోటి 45 లక్షల రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలని సీఐ శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నోటీసులపై సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..

Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు ఊరట.. నేటి పసిడి ధరలు ఇలా..!

Exit mobile version