Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
- ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
- గండికోట లాంటి బెస్ట్ ప్లేస్‌లు ఏపీలోనూ ఉన్నాయి
- 23 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏకే దక్కిందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారుకాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘స్టీల్ సిటీ, అల్యూమినియం సిటీ, రేరె ఎర్త్ మెటల్స్ హబ్‌గా తయారవుతున్నాం. మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ డిసెంబర్ నాటికి వస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే దిశగా అమరావతి సిద్ధమవుతోంది. 5th జనరేషన్ ఫైటర్ జెట్ 36 రోజుల్లో తీసుకొచ్చాం. పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకూ డిఫెన్స్ హబ్‌గా తయారవుతుంది. విమాన తయారీలో ఆన్సిలరీ కేంద్రంగా తయారవుతుంది. కలెక్టర్లు ఎన్ని MSME పార్కులు తెస్తారు అనే దానిపై పోటీ పెట్టాం. 60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు, 40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులతో రాయలసీమని ఆర్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక టూరిజం హబ్‌గా తయారవుతుంది. పోలవరం పూర్తైన తర్వాత పాపికొండలు నుంచి భద్రాచలం టూరిజం పుంజుకుంటుంది. అలాగే గండికోట లాంటి బెస్ట్ ప్లేస్‌లు మనకున్నాయి. జ్యోతిర్లింగం సహా పలు ప్రదేశాలు పెట్టుబడికి అవకాశం ఉన్నవే. ఖనిజ వనరులున్నాయి… పరిశ్రమలకు అవకాశం ఇస్తాం. 23 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏకే దక్కింది.’’ అని పేర్కొన్నారు.
‘‘లక్షమంది డ్వాక్రా సభ్యులను చూశాం. స్టార్టప్ సంస్కృతిని తీసుకొస్తున్నాం. ఏపీ నుంచి వంద యూనీకార్న్ సంస్ధలు ఏర్పాటు చేయాలని లక్ష్యం. 42 పారామీటర్లతో డేటా కలెక్ట్ చేస్తున్నాం. విలేజ్ టూ గ్లోబల్ మార్కెట్ మా లక్ష్యం. ఒక పరిశ్రమ వ్యర్థం మరో పరిశ్రమకు ముడి సరుకు. ఒప్పందాలు కేవలం పెట్టుబడికే పరిమితం కాదు. ప్రపంచంలో ఉండే స్కిల్స్‌ను తెచ్చి దానిని యువతకు అందించాలని చూస్తున్నాం. డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ప్రైవేట్ సెక్టర్‌ను పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. BITS PILANI లేటెస్ట్ క్యాంపస్ అమరావతిలో వస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. GEN Alpha, GEN Z, టీనేజర్స్ ఉన్నారు. GEN Alpha, GEN Z లు బెస్ట్ ఏజ్.. మీకు ఆసక్తి, ఆశయాలు చెప్పండి. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మిక దృక్పధం అవసరం. ఏపీని దేశంలోనే అత్యుత్తమ స్కిల్ నాలెడ్జ్ హబ్‌గా తయారు చేశాం. పలు రీజియన్లుగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నాం.’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?