Centre Releases Rs 1,805.24 Crore to AP: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.1,805.24 కోట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Releases Rs 1,805.24 Crore to AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద రూ.1,805.24 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు పేద మరియు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులపై కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. నరేగా నిధులు గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు పనిదొరకడంతో పాటు వారి కుటుంబాలకు జీవనోపాధి భద్రత లభిస్తుందని వివరించారు.
అదే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో కూడా ఈ నిధులు ఎంతో కీలకమని పేర్కొన్నారు పెమ్మసాని… ప్రతి అర్హుడికీ ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవనోపాధి స్థిరత్వాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!