Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు గ్రీన్‌ సిగ్నల్..

Ap

Ap

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 5200 కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయనున్నది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో బ్యాటరీ విద్యుత్ నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, రాయలసీమ జిల్లాలలో దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా కడప జిల్లాలోని మైలవరం సోలార్ పార్కులో 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి గ్రిడ్ కు అనుసంధానం చేయకుండా 400 మెగావాట్ల విద్యుత్తును బ్యాటరీ స్టోరేజ్ విధానంలో నిలువ చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని గని వద్ద 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 100 మెగావాట్లు, గోదావరి జిల్లాలో 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు…

Read Also: Pawan kalyan Letter: జనసేనాని బహిరంగ లేఖ.. పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Exit mobile version