Site icon NTV Telugu

AP High Court: హైకోర్టులో కీలక కేసుల విచారణ..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఈరోజు కీలక కేసులపై విచారణ జరగనుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ షరతులు సడలించి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరగనుంది. నెల్లూరులో నమోదైన రెండు కేసులు క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కాకాని. మరోవైపు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా ఏపీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.. తుని పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాడిశెట్టిరాజా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

Read Also: Dead Body In Suitcase: శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు

Exit mobile version