Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం రాష్ట్ర ప్రగతి చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ ఇలా స్పందించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యాల విస్తరణ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు నిలువెత్తు రూపమని పేర్కొన్నారు.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ, కొత్త వేగం లభిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. విమానాశ్రయం ద్వారా యువతకు మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం శాశ్వత మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి సేవలను అందిస్తూ విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్‌పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
ఉత్తరాంధ్ర అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమ్యానికి కొత్త రెక్కలు తొడుగుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి సేవలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకం. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం విజయవంతంగా ల్యాండ్ కావడంతో రాష్ట్ర…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) August 17, 2026
తాజావార్తలు
-
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
-
Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
-
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
-
Supreme Court: నిబంధనలు పాటించని విమాన సంస్థలు నిలిపేయండి.. కేంద్రానికి ఆదేశం
-
Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!