Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్‌ కేసులో ట్విస్ట్‌..! తెరపైకి మరో పేరు

Balam Sudhee

Balam Sudhee

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ఇప్పటికే కీలకంగా భావిస్తోన్న రాజ్‌ కసిరెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌.. ఈ కేసులో మరింత దూకుడు పెంచగా.. తాజాగా మరో కీలక వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది.. బియాండ్‌ కాఫీ అధినేత బాలం సుధీర్‌ పేరును లిక్కర్‌ స్కామ్‌ కేసులో ప్రస్తావిస్తున్నారు పోలీసులు.. రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సుధీర్‌ ఉన్నారు.. రాజ్ కసిరెడ్డి నుంచి బాలం సుధీర్‌కు రూ.50 కోట్లు అందినట్టుగా సిట్‌ అధికారులు విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తోంది…దీంతో, సుధీన్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది సిట్..

Read Also: Rajanna Sircilla District: పంచాయతీ సెక్రెటరీ మిస్సింగ్.. ఓ పార్టీకి చెందిన నాయకుడి టార్చర్తోనే..

రాజ్‌ కసిరెడ్డిని సిట్‌ అధికారులు విచారిస్తున్న సమయంలో బాలం సుధీర్‌ పేరు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. ఇక, సిట్‌ విచారణలో పలు కీలక అంశాలు బయటపడినట్టుగా సమాచారం.. నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సిట్‌ విచారణ కొనసాగగా.. మళ్లీ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా విచారణ సాగిస్తున్నారు.. మొత్తంగా ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో రాజ్‌ కసిరెడ్డి కీలకంగా ఉన్నారు.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రాజ్‌ కసిరెడ్డిని అరెస్ట్‌ చేశారు సిట్‌ అధికారులు.. మూడు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాని రాజ్‌ కసిరెడ్డి.. చివరకు రేపు విచారణకు వస్తానంటూ సమాచారం ఇచ్చినా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించిన విషయం విదితమే..

Exit mobile version