Site icon NTV Telugu

Group-1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఎస్సీ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన..

Appsc

Appsc

Group-1 Mains Results: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (A.P.P.S.C.).. ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ.. అయితే, ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే మూల్యాంకనం చేపట్టిన ఏపీపీఎస్సీ.. నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది. రిజల్ట్స్‌ను APPSC వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేసింది ఏపీపీఎస్సీ.. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొంది..

Read Also: Health Tips: అవసరానికి మించి నడుస్తున్నారా?.. ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!

మరోవైపు, ఎస్సీ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ సూచనలు చేసింది.. ఇదివరకే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకున్న ఎస్సీ అభ్యర్థులు మరలా వారి కులం ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూపుకు చెందుతుందో పరిశీలించుకోవాలని ఏపీపీఎస్సీ పేర్కొంది.. https://psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెబ్‌లో నోట్‌ విడుదల చేసింది.. దీని ద్వారా తదుపరి వచ్చే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఆన్ లైన్ దరఖాస్తు చేయడానికి తప్పనిసరి అని పేర్కొంది ఏపీపీఎస్సీ..

గ్రూప్‌ – 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన APPSC..#
మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన APPSC..#
నెల రోజుల్లోనే గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాలు విడుదల..#
APPSC వెబ్‌సైట్లో గ్రూప్‌-1 ఫలితాలు..#
ఈనెల 23 నుంచి 30 వరకు గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు..

Exit mobile version