AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Alert: ఏపీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న స్థాయిలో వానలు లేకపోయినా.. ఓ మోస్తరు వానలు పడుతున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు పిడుగుపాటుతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.
Also Read
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
తాజావార్తలు
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
-
2011 World Cup Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్ సిక్స్.. ధోనీ సీక్రెట్ బయటపెట్టిన శ్రీలంక బౌలర్..
-
Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!