APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళల నుంచి ‘స్త్రీ శక్తి’ పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపింది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఉచిత ప్రయాణాల ద్వారా ఇప్పటివరకు మహిళలకు సుమారు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగినట్లు వెల్లడించింది. ప్రయాణ ఖర్చుల భారం తగ్గడంతో మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపింది.
ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొంది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అభినందించారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ‘స్త్రీ శక్తి’ పథకం కీలకంగా మారిందని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తవడం పథకానికి మహిళల నుంచి లభిస్తున్న ఆదరణకు నిదర్శనమని తెలిపింది.
Also Read
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
తాజావార్తలు
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ట్రెండింగ్
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!