Site icon NTV Telugu

SSC Exam Fee Deadline Extended: టెన్త్‌ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Ssc Exam Fee Deadline Exten

Ssc Exam Fee Deadline Exten

SSC Exam Fee Deadline Extended: ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్ష ఫీజు గడువును మరోసారి పొడిగించింది SSC బోర్డు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు..

లేట్‌ ఫీతో మరికొన్ని అవకశాలు..
* రూ.50 లేట్ ఫీతో – 12వ తేదీ వరకు అవకాశం..
* రూ.200 లేట్ ఫీతో – 15వ తేదీ వరకు చెల్లింపు..
* రూ.500 లేట్ ఫీతో – 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఇచ్చారు..

ఇప్పటికీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.. ఇక, SSC వార్షిక పరీక్షలు- 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు..

SSC పరీక్షల – తేదీల వివరాలు..
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 – ఇంగ్లీష్
మార్చి 23 – గణితం (మ్యాథ్స్)
మార్చి 25 – ఫిజిక్స్
మార్చి 28 – బయాలజీ
మార్చి 30 – సోషల్ స్టడీస్
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1 – ఒకేషనల్ కోర్స్‌ పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం విదితమే..

Exit mobile version