NTV Telugu Site icon

SIT Notices to Vijay Sai Reddy: విజయసాయిరెడ్డికి షాక్‌.. లిక్కర్‌ కేసులో నోటీసులు..

Sit Notices To Vijay Sai Re

Sit Notices To Vijay Sai Re

SIT Notices to Vijay Sai Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌).. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మూడు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరు కాలేదు.. తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది.. మరోవైపు.. కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి మూడోసారి నోటీసు ఇచ్చారు సిట్‌ అధికారులు.. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. కసిరెడ్డి కంటే ఓకరోజు ముందే విచారణకు రావాలని విజసాయిరెడ్డికి నోటీసు ఇచ్చారు.. లిక్కర్ స్కాం అంతా కసిరెడ్డి సూత్రధారిగా జరిగిందని గతంలోనే విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే కాగా.. కసిరెడ్డి దొరకకుంటే సాయిరెడ్డి నుంచే తదుపరి విచారణకు స్టెప్ తీసుకునే విధంగా సిట్‌ ముందుకు సాగుతోంది..

AP SIT Issues Notices to Vijay Sai Reddy in Liquor Scam | Ntv