AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP PECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET)-2026 ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శారీరక విద్య మరియు క్రీడల రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శారీరక విద్య మరియు క్రీడల రంగంలో తదుపరి అడుగు వేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్… భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణంలో ప్రతి అభ్యర్థి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది AP PECET-2026 పరీక్షలో మొత్తం 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 2,655 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 89.76 శాతంగా నమోదైంది. ఇక, పురుష అభ్యర్థుల విషయానికి వస్తే, 1,993 మంది అర్హత సాధించి 92.91 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మహిళా అభ్యర్థుల్లో 662 మంది అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 81.43 శాతంగా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. అలాగే ర్యాంక్ కార్డులను కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ (9552300009) ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Delighted to announce the APPECET–2026 results!
Congratulations to all the successful candidates who have taken the next step towards a career in Physical Education and Sports.
Key highlights of this year –
– 89.76% overall pass rate
– 4,037 registered | 2,958 appeared | 2,655…— Lokesh Nara (@naralokesh) June 16, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?