NTV Telugu Site icon

AP Liquor Policy Notification: నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ..

Ap Liquor Policy

Ap Liquor Policy

AP Liquor Policy Notification: ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. ఇక వైఎస్‌ జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. ఇక, దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఇస్తాం.. ఏ జిల్లాలో ఎన్ని షాపులు అనే వివరాలు వస్తాయని చెప్పారు.

Read Also: Tirupati Laddu Controversy: దూకుడు పెంచిన సిట్.. నేడు లడ్డూ పోటు ఉద్యోగుల విచారణ..

ఇక, కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు.. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ఎక్సైజ్‌ శాఖ.. లైసెన్స్‌ ఫీజులు 50 నుంచి 85 లక్షలుకొత్త పాలసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.. అందుకు అనుగుణంగా మంగళవారం ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్‌లు జారీ చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.. దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఉంది.. ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయించింది ప్రభుత్వం.. ఈ పాలసీ అనంతరం గీత కులాలకు రిజర్వ్‌ చేసిన మరో 340 షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలచిన 12 ఎలైట్‌ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్‌ వస్తుంది..

Read Also: Tirupati Laddu Controversy: దూకుడు పెంచిన సిట్.. నేడు లడ్డూ పోటు ఉద్యోగుల విచారణ..

మద్యం షాపులకు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలుగా నిర్ణయించారు.. అయితే, ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అయినా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.. లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న వ్యాపారులు ఒక రోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని వెల్లడించింది.. ఆ వెంటనే 12వ తేదీ నుంచి ప్రైవేటు షాపులు తెరుచుకుంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.. వాస్తవానికి సోమవారంమే ప్రభుత్వ షాపుల పాలసీ గడువు ముగిసింది. అయితే, ప్రైవేటు పాలసీ కొంత ఆలస్యమైనందున ప్రస్తుత పాలసీని 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఈలోగా ప్రైవేటు షాపులు ప్రారంభమైతే ప్రభుత్వ షాపులు మూతపడనున్నాయి.. ఆ ప్రకారం 11వ తేదీ ప్రభుత్వ మద్యం షాపులకు చివరి రోజు కానుంది. ఆ రోజున లైసెన్సీలను ఎంపిక చేస్తారు.. దీంతో ఆ తర్వాత ప్రభుత్వ షాపులు ఉండవు.

Read Also: Deputy CM Pawan Kalyan Tirumala Visit: నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌.. నడకమార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం

ఈసారి లైసెన్స్‌ ఫీజులను భారీగా పెంచింది ప్రభుత్వం.. జనాభా ప్రాతిపదికన షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.50 లక్షలు. 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్‌ ఫీజు 65 లక్షలుగా ఉంది.. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను లైసెన్సీలు ఆరు విడతలుగా చెల్లించవచ్చు అని వెల్లడించింది.. అయితే లైసెన్స్‌ ఫీజులతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్‌ను సైతం ఈసారి రెట్టింపు చేసింది.. గతంలో 10 శాతం ఉంటే ఇప్పుడు 20శాతం మార్జిన్‌ వ్యాపారులకు వస్తుందని వెల్లడించింది ఎక్సైజ్‌ శాఖ.. అన్ని బ్రాండ్లు అందే విధంగా పారదర్శకంగా అందిస్తున్నాం.. 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని సామాన్యులకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్‌మెంట్ వారిని సెబ్ పేరుతో విడగొట్టారని తెలిపారు. ఇప్పుడు రెండింటినీ కలుపుతూ నిర్ణయం తీసుకున్నాం.. సీన‌రేజ్ చార్జి కట్టి లోడింగ్ అన్ లోడింగ్ కడితే పట్టా ల్యాండ్‌లో సాండ్ తీసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర సూచించిన విషయం విదితమే..