AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగియగా.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.. మరోవైపు.. మిగిలిపోయిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు ఇవాళ ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారు. దీంతో నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఎల్లుండి చివరి తేదీగా నిర్ణయించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నవంబర్ 19న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ముగియనుంది. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మొదట నిర్ణయించిన తేదీకి బదులుగా కలెక్టర్ల అభ్యర్థన మేరకు ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు చేశారు. దీంతో నవంబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం డిసెంబర్ 5 లేదా 6 తేదీల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
- Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- CII Partnership Summit: ఏపీ పారిశ్రామిక రంగానికి బూస్ట్.. 73 కంపెనీలతో కీలక ఒప్పందాలు.. లక్ష మందికి పైగా ఉద్యోగాలు
ఈ ఎన్నికలు రాష్ట్రంలోని మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో జరగనున్నాయి. వీటిలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి–తాడేపల్లి ఉన్నాయి. అదేవిధంగా 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బీ.కొత్తకోట ఉన్నాయి. మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించనున్నాయి.
తాజావార్తలు
-
Non Binary Gender: పురుషుడు, స్త్రీకి భిన్నమైన లింగ గుర్తింపు.. నేహా బోరా గుర్తించుకున్న నాన్ బైనరీ జెండర్ అంటే?
-
Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
-
Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
-
Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
-
IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!