Marri Rajasekhar: వైసీపీలో తనకు అన్యాయం జరిగింది అంటున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజ్ శేఖర్.. మండలి చైర్మన్ తన రాజీనామా ఆమోదించే అవకాశం ఉందని తెలిపారు.. ఇక, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని మండలి చైర్మన్ కు చెప్పా అన్నారు.. 2025 మార్చి 19న నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేశాన.. నా రాజీనామా మండలి చైర్మన్ కు ఇచ్చాను .. స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చాను అని స్పష్టం చేశారు.. ఇవాళ నన్ను హాజరు కావాలని మండలి చైర్మన్ కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది… మీరు ఇష్ట పూర్వకంగా రాజీనామ చేసారా? అని అడిగారని తెలిపారు..
Read Also: CM Revanth Reddy : వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
స్వచ్ఛంద రాజీనామా నా హక్కు.. కారణాలు అవసరం లేదు.. నా నిర్ణయం అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజ్‌శేఖర్.. అనారోగ్యమా.. బలవంతమా.. అనేవి ఉండవు.. రాజీనామా ఎలా చేయాలి.. అనే రూల్స్ ఉంటాయి.. రూల్ బుక్ ప్రకారం రాజీనామా చేశానని స్పష్టం చేశారు.. మరోవైపు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ అన్నారు.. నేను.. కమ్మ అని టీడీపీ తీసుకోలేదు.. నాకు గౌరవం ఇచ్చిన పార్టీ.. టీడీపీ అని పేర్కొన్నారు.. అసలు నన్ను వైసీపీ పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది..? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ మర్రి రాజ్‌శేఖర్..
