Site icon NTV Telugu

Minister Narayana: రేపటి నుంచి గుజరాత్‌లో నారాయణ బృందం పర్యటన

Ministernarayana

Ministernarayana

మంత్రి నారాయణ బృందం ఆది, సోమవారాల్లో గుజరాత్‌లో పర్యటించనుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లో అధ్యయనానికి నారాయణ, అధికారులు వెళ్లనున్నారు. మంత్రి వెంట సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు వెళ్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా ఆదివారం ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మంత్రి నారాయణ, అధికారులు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం సర్దార్ పటేల్ విగ్రహం అధ్యయనం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..

ఇక మధ్యాహ్నం అహ్మదాబాద్ శివారులో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని పరిశీలించనున్నారు. అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీ (సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ) సందర్శించనున్నారు. రేపు రాత్రికి అహ్మదాబాద్‌లో స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్నారు. ఎల్లుండి ఉదయం సబర్మతి రివర్ ఫ్రంట్‌ను మంత్రి బృందం పరిశీలించనుంది.

ఇది కూడా చదవండి: Blue Drum: పెళ్లిలో వరుడికి గిఫ్ట్‌గా ‘‘బ్లూ డ్రమ్’’.. ఒక్కసారిగా అంతా షాక్..

Exit mobile version