Site icon NTV Telugu

New Bulletproof Vehicles: వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. హోంశాఖ ఆదేశాలు

Ap Govt

Ap Govt

New Bulletproof Vehicles: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు సిద్ధమైంది.. దీనిపై ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ.. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్‌ ఫ్రూఫ్‌గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఏపీలోని కొందరు ముఖ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలకు రక్షణగా ఈ వాహనాలు వినియోగించనున్నారు.. ఇక, వీఐపీల భద్రత కోసం కొనుగోలు చేయనున్న 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం రూ.9.20 కోట్లు వెచ్చించాలని ఆదేశాల్లో పేర్కొంది ఏపీ హోంశాఖ.. అయితే, గతంలో ఉన్న వాహనాలకు ఈ కొత్త బుల్లెట్‌ ప్రూఫ్ వాహనాలు అదనం కానున్నాయి.. కొత్త వాహనాలు కాబట్టి.. సరికొత్త హంగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Alencier Lopez: రజనీ, అమితాబ్ కు ఎలా నటించాలో తెలియదు… నటుడి వివాదాస్పద ప్రకటన

Exit mobile version