Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Single-Teacher Schools: ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ టీచర్లు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. తక్కువ మంది ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తుండటంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన అందడం లేదని, దీనివల్ల వారి విద్యా నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కనీసం ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా సింగిల్ టీచర్ లేదా తక్కువ మంది ఉపాధ్యాయులతో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు 16 వేలకుపైగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ అంశాన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్రంలోని సింగిల్ టీచర్ పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల ఖాళీలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాగా, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతున్నా.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న విషయం విదితమే.. ఈ పరిణామాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది..
Also Read
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్‌లైన్ పెట్టి మరి..!
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
తాజావార్తలు
-
The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
-
Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
-
Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
-
CM Revanth Reddy : పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
-
Team India: రుతురాజ్, పటీదార్లకు ఘోర పరాభవం.. రికార్డులు ఉన్నా కనీసం కనుచూపు మేరలో కూడా లేరు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!