Site icon NTV Telugu

AP High Court: పోలీస్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ.. సీఎస్, హోం సెక్రటరీకి హైకోర్టు కీలక ఆదేశాలు..

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది హైకోర్టు.. అదే సమయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కఠిన సూచనలు చేసింది. సుప్రీం కోర్టు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా పోలీసు విభాగంలో ఖాళీలను ప్రతి ఏడాది గైడ్‌లైన్స్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు. గత సెప్టెంబర్‌లో పోలీసు విభాగంలో ఖాళీల భర్తీపై, మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి అనుమతి ఇవ్వాలని హోం సెక్రటరీకి డీజీపీ లేఖ పంపినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటి వరకు సంబంధిత నివేదికలు సమర్పించాలని సీఎస్ మరియు హోం సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.

Read Also: CM Chandrababu: రోడ్ల నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Exit mobile version