SIT on Adulterated Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు సంచలనంగా మారింది.. అయితే, రాష్ట్రంలో నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సమగ్ర దర్యాప్తు కోసం నలుగురితో ప్రత్యేక దర్యాప్తు బృందం.. సిట్ ఏర్పాటు చేసింది.. ప్రభుత్వం.. ఆన్నమయ్య జిల్లా ములకల చెరువు లో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసును దర్యాప్తుచేయనుంది సిట్. సిట్ చీఫ్‌గా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ను నియమించింది. సిట్ సభ్యులుగా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ… సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి… టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికాగార్గ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
Read Also: Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఫ్యామిలీ వార్.. అభ్యర్థులను ప్రకటించిన లాలూ పెద్ద కుమారుడు!
అయితే, ఇప్పటికే నకిలీ మద్యం కేసుపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చిన ములకలచెరువు, భవానీపురం ఎక్సైజ్ పోలీసులు.. నకిలీ మద్యం కేసులో తదుపరి సమగ్ర దర్యాప్తు చేయాలని సిట్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.. అక్రమ తయారీ, సరఫరా, నకిలీ మద్యం పంపిణీకిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పురోగతి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ కె. విజయానంద్..
