Site icon NTV Telugu

Andhra Pradesh: రైతులకు గుడ్‌న్యూస్‌.. నిధులు విడుదల..

Kharif Crop Insurance Schem

Kharif Crop Insurance Schem

Andhra Pradesh: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంట బీమా పథకాలకు నిధులు విడుదల చేసింది సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఖరీఫ్‌ పంట బీమా పథకానికి 132 కోట్ల 58 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50 శాతం నిధులు విడుదలయ్యాయి.. ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఈ నిధులు వినియోగించనున్నారు.. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల 58 లక్షల నిధులు విడుదల చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Read Also: MP Laxman: పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం?.. రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఫైర్..

మరోవైపు, ఖరీఫ్ సీజన్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ పెంపు 2025-26 మార్కెటింగ్ సీజన్ నుండి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. నైజర్ సీడ్స్‌కు క్వింటాల్‌కు రూ.820 అత్యధికంగా పెంచగా, వరికి క్వింటాల్‌కు రూ.69 పెంచింది కేంద్రం.. ఇక, రైతుల పెట్టుబడికి 50 శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్..

Exit mobile version