NTV Telugu Site icon

Free Gas Cylinders: దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు..

Cm Chandrababu

Cm Chandrababu

Free Gas Cylinders: దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన విషయం విదితమే.. అయితే, ఈ పథకం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ఈ రోజు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేసింది దీపం -2 పథకం.. ఇక, 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..

Read Also: Gold Rates Hike: అప్పుడు 28 వేలు, ఇప్పుడు 81 వేలు.. బంగారం ధరలు పెరగటానికి కారణం ఏంటంటే?

సచివాలయంలో.. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ సబ్సిడీ మొత్తాన్ని ఈ రోజు అందించారు సీఎం చంద్రబాబు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..