NTV Telugu Site icon

AP Government: స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్.. రూ.1452 కోట్ల నిధుల విడుదల చేసిన సర్కార్

Ap

Ap

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. స్థానిక సంస్థల కోసం రూ. 1452 కోట్ల నిధుల విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వం పక్కదారి పట్టించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ. 998 కోట్లు, అర్బన్ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ. 454 కోట్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ.

Read Also: Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్ఖల బలోపేతమే ప్రజా కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం వాటిని బలోపేతం చేస్తున్నాం అన్నారు.. గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మా గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాది అన్నారు. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నిధుల విడుదలతో స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం కలుగుతుందని వెల్లడించారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌..