PSR Anjaneyulu Arrest: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఇవాళ ఉదయం బేగంపేటలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు.. సాయంత్రంలోగా పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసినట్టు అధికారికంగా చూపే అవకాశం ఉంది.. ఇక, ఇదే కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు క్రాంతి రానా టాటాతో పాటు విశాల్ గున్నిలపై ఆరోపణలు ఉన్నాయి.. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ముందస్తు బెయిల్ తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జత్వానీని వేధించి నందుకు కేసు నమోదు చేశారు.. గత ప్రభుత్వ సమయంలో నటి జత్వానీని విజయవాడకు తీసుకువచ్చి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
PSR Anjaneyulu Arrest: ముంబై నటి జత్వానీ కేసు.. సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!
- సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..
- గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్సార్..
- ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్..
- హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలింపు..

Psr Anjaneyulu