NTV Telugu Site icon

AP DGP Serious Warning: పహల్గామ్ ఉగ్రదాడి.. వారికి ఏపీ డీజీపీ సీరియస్‌ వార్నింగ్

Dgp Harish Kumar Gupta

Dgp Harish Kumar Gupta

AP DGP Serious Warning: పహల్గామ్ ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది.. దీంతో, పాకిస్థాన్‌ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది భారత ప్రభుత్వం.. పాకిస్థానీయులు భారత్‌ విడిచి వెళ్లిపోవాలంటూ డెడ్‌లైన్‌ విధించింది.. పనిలో పనిగా సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. తమకు తోచిన పోస్టులు పెడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. వారికి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా..

Read Also: Rohit Sharma: ఆ.. భారీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో “భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా” పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ.. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై అలెర్ట్ జోన్స్ గా ప్రకటించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. హై అలెర్ట్ జోన్స్ గురించి “భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు అని స్పష్టం చేశారు.. అలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దు అని సూచించారు.. ఇక, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..