NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: చివరి నిమిషంలో పవన్‌ పర్యటన వాయిదా.. నెక్ట్స్ ఏంటి..?

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. చివరి నిమిషంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆయన.. మరో కీలక నిర్ణయం తీసుకుంటూ.. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకున్నారు.. అయితే, దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనను వాయిదా వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం ఆలయాల సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్న పవన్‌ కల్యాణ్‌.. తొలి విడతలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు.. తొలుత అనంతపద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లాలనుకున్న ఆయన.. చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే, పవన్‌ కల్యాణ్ పర్యటన వాయిదా శాశ్వతమా? లేక తాత్కాలికమా? అనే సమాచారం తెలియాల్సి ఉంది.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల సందర్శన వార్తను ముందే బ్రేక్‌ చేసింది ఎన్టీవీ.. దీంతో, నిన్నటి నుంచి ఈ యాత్ర మీదే చర్చ సాగుతోంది.. అయితే, పవన్ కల్యాణ్‌ తాజా నిర్ణయంతో నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే దానిపై పార్టీ శ్రేణులతో పాటు.. పొలిటికల్‌ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది..