Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలి..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవానికి హాజరయ్యారు పవన్‌.. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.. పహల్గామ్‌ ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం ప్రకటించి సభను ప్రారంభించిన పవన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలు భారతదేశానికి పట్టుకొమ్మలు.. గ్రామాలే స్వయంప్రతిపత్తి కల వ్యవస్ధలుగా ఏర్పడాలి.. పల్లెల అభివృద్ధి చాలా కీలకం.. కక్ష సాధించం ఎవరిమీదా.. పంచాయితీ డబ్బులు పంచాయితీకే ఖర్చు పెట్టాలని స్పష్టం చేశారు.. సీఎం చంద్రబాబు నాయకత్వ మీద నమ్మకంతో డబ్బులు ఇవ్వకపోయినా పనులు చేసిన కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కొంత కొరత ఉంది.. అందువల్లే నిధుల విడుదల ఆలస్యం అయింది అన్నారు.

Read Also: Jasprit Bumrah: బుమ్రా.. కాస్తైనా కనికరం ఉండక్కర్లా!

ఇక, పంచాయితీరాజ్ లో గతంలో బదిలీలు నుంచీ ప్రతీదానికీ డబ్బులు… నేను పని చేసేవాళ్ళని, సమర్ధతని, ఇంటెగ్రిటీ ఉన్న అధికారులను వెతికి పట్టుకోమని చెప్పాను అన్నారు పవన్‌ కల్యాణ్‌.. గత ఐదేళ్ళలో జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం లాంటి సందర్భం చూడలేదు.. ఏ పార్టీ గ్రామంలో ఉన్నా గ్రామం గ్రామమే.. పార్టీలకు అతీతంగా పంచాయితీకి గౌరవం ఇచ్చాం.. పంచాయితీలను నిర్లక్ష్యం కాకుండా చూశాం.. ఉపాథి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్ చేశాం అన్నారు.. ఉపాధి కూలీ అనే పదం మార్చి నరేగా శ్రామికులు లేదా గ్రామ వికాస శ్రామికులు అనే పదం వాడాలని సూచించారు. కూలీ అని బ్రిటీషర్స్ తెచ్చిన తక్కువ చేసి చూసే పదం.. కూలీ అనద్దు.. శ్రామికుడు అనండి‌.. గ్రామ సభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి పనులు చేశాం.. 1005 కోట్లతో 601 ప్రాంతాలకు 1069 కిలోమీట్ల రోడ్లను అడవితల్లి బాటగా ఆమోదించాం.. రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో 24 ర్యాంకు నుంచీ 2వ స్ధానానికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాం అని వెల్లడించారు..

Read Also: Jammu Kashmir: భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ఆర్మీ జవాను వీరమరణం..

కలప మొక్కల పెంపకం చేయాలనే ప్రణాళిక చేశాం.. కలపను దిగుమతి చేసుకునేవిధానం మార్చి ఆదాయ వనరుగా, వాతావరణ పరిస్థితులు సరిగా ఉండేలా కలపను పెంచాలని చూస్తున్నాం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. కలప పెంపకం ద్వారా 20 వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుందన్న ఆయన.. స్ధానిక సంస్ధలను స్ధానిక ప్రభుత్వాలుగా మార్చడం కోసం పని చేస్తున్నాం.. రైల్వేకోడూరు ప్రాంతంలో ఒక గ్రామానికి అసలు రెవెన్యూ భూమి లేదు అని గుర్తించాం.. పంచాయితీల భూములు, ఆస్తులపై ఆడిట్ జరగాలి‌.. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు వచ్చినా నేను చూసుకుంటాను అన్నారు.. కాశ్మీర్ లో అయినా ఎక్కడ ఏం జరిగినా గ్రామాలు కూడా పట్టించుకోవాలి.. గ్రామాలు జాతీయ సమగ్రతకు పట్టుకొమ్మలు కావాలి.. 13326 పంపచాయితీలలో జాతీయ సమగ్రతా ప్రాంగణం.. జాతీయ సమగ్రతా స్ధూపం ఉండాలని స్పష్టం చేశారు.. ఇక, కాశ్మీర్ లో మరణించిన వారి అంత్యక్రియలకు వెళ్తున్నాను.. కావలి, విశాఖకు వెళ్లనున్నట్టు వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version