Deputy CM Pawan Kalyan: పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే భారత్ వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నవారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన.. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకలు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా వున్నట్టు వున్నారు.. అంతలా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే వదిలి వెళ్లిపోండి అని సూచించారు.. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్..
Read Also: Leopard: సిద్దుల గుట్టలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
మత ప్రాతిపదికన హత్యలు ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోం అన్నారు పవన్ కల్యాణ్.. తప్పులు చేసిన వారిని రక్షిస్తూ వైట్ వాష్ చేయవద్దన్న ఆయన.. పాకిస్థాన్ జనాభాకు సమానంగా భారత్‌లో ముస్లింలు ఉన్నారు.. కానీ, భారతదేశంలో మత వివక్షకు చోటులేదని స్పష్టం చేశారు.. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశం.. ఇక్కడే చంపేస్తే ఎక్కడికి పోవాలి..? అని ప్రశ్నించారు.. క్లిష్ట సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది.. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయాలకంటే దేశ భద్రత ముందని పిలుపునిచ్చారు.. ఓట్ల కోసమే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం అవసరం అన్నారు పవన్.. సరిహద్దు ప్రాంతంలో తూటా పేలితే దేశం మొత్తం ప్రకంపనలు.. షికారుకు వచ్చినట్టే వచ్చి, అమాయకులను వేటాడి వెళ్లిపోయారు.. తల ఉండాల్సిన చోట తల లేకుండా క్రూరంగా చంపారు.. 30 పైగా బుల్లెట్లు దించడమే అమానుష దాడికి నిదర్శనం అంటూ ఆవేదన వ్యక్తం చే శారు..
Read Also: Tollywood : మరొక మలయాళం సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్
దేశంలో ఎక్కడ ఏం జరిగినా, దేశం మొత్తం దాని ప్రభావం ఉంటుంది.. సరిహద్దు మేనేజ్మెంట్ చాలా క్లిష్టమైన పని.. సరిహద్దులు కాపాడుకోకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నారు పవన్ కల్యాణ్.. ఉగ్రవాదాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు.. అయితే, ఉగ్రవాదాలను ఎదుర్కోవాలి అంటే ధైర్యంతో కుడిని పని అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
