Deputy CM Pawan Kalyan: హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. సొంత డబ్బుతో స్కూల్‌కు ప్లే గ్రౌండ్‌..

  • మైసూర వారి పల్లెకు మహర్దశ ..
  • సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేసిన డిప్యూటీ సీఎం..
  • 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసిన పవన్..
  • ఆ భూమిని పంచాయితీ కార్యాలయానికి దానం చేసిన పవన్‌ కల్యాణ్‌..
Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చొరవతో ఉమ్మడి కడప జిల్లాలోని మైసూర వారి పల్లెకు మహర్దశ పట్టింది.. డిప్యూటీ సీఎం సొంత నిధులతో పాఠశాలకు ప్లే గ్రౌండ్ దానం చేశారు.. తన సొంత ఖర్చులతో 60 లక్షలు ఖర్చు చేసి 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి పంచాయితీ కార్యాలయానికి దానం చేశారు పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు నెలల క్రితం మొట్టమొదటిసారిగా రైల్వే కోడూరు మండలం మైసూరవారి పల్లెలో పర్యటించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, అన్నమయ్య జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు..

Read Also: Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 22 మంది మృతి

మరోవైపు.. రైల్వే కోడూరు మండలం మైసూరావారి పల్లెలో హెల్త్ సెంటర్ కు 10 సెంట్లు దానం ఇచ్చాడు రైతు.. దీంతో.. హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అధికారులు… ఇక, తాను ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు అన్నమయ్య జిల్లా అధికారులతో సమీక్షిస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్‌.. హామీల అమలకు కృషిచేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందించారు..