పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబు ఇచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Samantha: వారిని కఠినంగా శిక్షించాలి.. సమంత పోస్ట్ వైరల్
రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని చెప్పారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పని చేస్తుందని.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Union Budget 2025: కేన్సర్ పేషెంట్లకు శుభవార్త.. 3 ఏళ్లలో ప్రతి జిల్లాల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లు
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈసారి రూ.50,65,345 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించబడింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, వివిధ రంగాలకు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు. రక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఐటీ, పట్టణాభివృద్ధి, శాస్త్ర, సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Chandrababu: పేదల ఆదాయాన్ని పెంచడమే నా అభిమతం