CM Chandrababu: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో పుష్పాంజలి ఘటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పలువురు కేంద్ర మంత్రులు.. ఇక, వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Gold Rate Today: పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
“భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి.. వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను.. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను.. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నాను..” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది. 'నేషన్ ఫస్ట్' అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి… pic.twitter.com/r2jGOMmSkT
— N Chandrababu Naidu (@ncbn) December 25, 2024